గర్భిణులు తప్పనిసరిగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే వైద్యం పొందాలి

3చూసినవారు
గర్భిణులు తప్పనిసరిగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే వైద్యం పొందాలి
జిల్లాలోని అన్ని ప్రభుత్వ మాతా, శిశు ఆరోగ్య కేంద్రాల్లో గర్భిణి మహిళలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, గర్భిణులు తప్పనిసరిగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే వైద్యం పొందాలని జిల్లా కలెక్టర్ హైమావతి సూచించారు. బుధవారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక – 99 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా జిల్లా కేంద్రంలోని జిల్లా జనరల్ ఆసుపత్రిలో నిర్వహించిన “సేఫ్ మదర్ డే” కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ గర్భధారణ ప్రారంభం నుంచి శిశువు జననం వరకు తల్లి-శిశువుల ఆరోగ్యాన్ని కాపాడడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్