పదోన్నతులు అనేవి హోదాతో పాటు మరింత బాధ్యతను పెంచుతాయి

0చూసినవారు
పదోన్నతులు అనేవి హోదాతో పాటు మరింత బాధ్యతను పెంచుతాయి
సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో పదోన్నతి పొందిన అధికారులను శనివారం పోలీస్ కమిషనర్ రష్మీ ప్రత్యేకంగా అభినందించారు. కానిస్టేబుల్ నుండి ఎఎస్ఐగా ముగ్గురు, ఎఎస్ఐ నుండి ఎస్ఐగా నలుగురు అధికారులు పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ, పోలీస్ శాఖలో పదోన్నతులు హోదాతో పాటు బాధ్యతను పెంచుతాయని, ప్రమోషన్ పొందిన అధికారులు రెట్టింపు ఉత్సాహంతో ప్రజా సేవే పరమావధిగా విధులు నిర్వహించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్