చేర్యాల, సిద్దిపేట జిల్లాలో న్యాయవాది స్వప్న హత్యకు నిరసనగా, చేర్యాల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. వెంటనే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఆరెల్ల వీరమల్లయ్య, ప్రధాన కార్యదర్శి తాటికొండ ప్రణీత్ తో పాటు పలువురు సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.