బెజ్జంకి, తోటపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఆదివారం పల్స్ పోలియో ఇమ్యూనైజేషన్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. వైద్యాధికారులు మాధురీ, కృష్ణ తేజ నేతృత్వంలో మొబైల్ టీమ్ గ్రామ పరిధిలోని దూరప్రాంతాలు, హై రిస్క్ ప్రాంతాలు, కోళ్ల ఫారాలు, ఇటుక బట్టీల వద్దకు వెళ్లి చిన్నారులకు పోలియో చుక్కలు అందించారు. వైద్య సిబ్బంది ప్రతి ఇంటిని సందర్శించి, టీకా మిస్ కాకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. కష్టతర ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి కూడా పోలియో చుక్కలు అందించారు. ఈ కార్యక్రమం ద్వారా మండల వ్యాప్తంగా చిన్నారులకు పోలియో చుక్కలు పంపిణీ చేశారు.