వరి ధాన్యము సెంటర్ లలో కొనుగోలు వేగవంతం చెయ్యాలి

5చూసినవారు
వరి ధాన్యము సెంటర్ లలో కొనుగోలు వేగవంతం చెయ్యాలి
రైతులు పండించిన పంటను పూర్తిగా కొనుగోలు చేస్తామని, అన్ని వరి ధాన్యము సెంటర్ లలో కొనుగోలు వేగవంతం చెయ్యాలని జిల్లా కలెక్టర్ హైమావతి ఆదేశించారు. బుదవారం సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ, చేర్యాల మండలం వేచరేణి గ్రామం, కొమురవెల్లి మండల కేంద్రంలోని వరి ధాన్య కొనుగోలు ప్రక్రియను కలెక్టర్ క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీలో మక్కలు, వరి ఒకేసారి మార్కెట్ వస్తుందని చేర్యాల చుట్టుపక్కల నుండి కాకుండా జనగాం జిల్లా బచ్చన్నపేట, నర్మేట మండలాల నుండి మక్కలు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చేర్యాలకు వస్తుందని అందుకే కొనుగోలులో ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్