ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంటూ కష్టపడి పండించిన రైతులకు కాంగ్రెస్ పాలనలో కష్టాలు తప్పడం లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో మద్దతు ధర అందక మక్క రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం ఆరేపల్లి (అక్కెనపల్లి) గ్రామంలో సుమారు 350 ఎకరాల్లో మక్క సాగు చేస్తున్న రైతులు ప్రతి ఏటా నష్టపోతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమని, అవసరమైన అన్ని ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, మద్దతు ధర చెల్లించి మక్కలు కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.