ప్రపంచ క్యాన్సర్ నివారణ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సూక్ష్మజీవశాస్త్ర, జంతు శాస్త్రవిభాగం, హెల్త్ కేర్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో మైక్రోబయోలజిస్టు సొసైటీ సహకారంతో క్యాన్సర్ పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా క్యాన్సర్ కు సంబంధించిన సందేహాల నివృత్తి కోసం ప్రత్యేకంగా రూపొందించిన క్యూఆర్ కోడ్ ను విద్యార్థులకు అందజేశారు. ఈ క్యూఆర్ కోడ్ ద్వారా విద్యార్థులు ఎప్పుడైనా క్యాన్సర్ నివారణ, ముందస్తు పరీక్షలు, ఆరోగ్య సూచనలపై సమాచారం పొందే సౌకర్యం కల్పించబడింది.