సిద్దిపేట జిల్లా నంగునూరులో జరిగిన వంట నిర్వాహకులు, ప్రధానోపాధ్యాయుల సమావేశంలో నంగునూరు మండల విద్యాధికారి పురుమాండ్ల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని నాణ్యతతో నిర్వహించి విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని సూచించారు. ఈ పథకం విద్యార్థుల ఆరోగ్యాభివృద్ధికి కీలకమని, ప్రభుత్వం నిర్దేశించిన మెనూను తప్పనిసరిగా అమలు చేయాలని, భోజనం తయారీలో పరిశుభ్రత ప్రమాణాలు పాటిస్తూ, నాణ్యమైన సరుకులను మాత్రమే వినియోగించాలని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన కోరారు.