
మద్రాసు హైకోర్టుకు వెళ్లే ఆలోచనలో టీవీకే పార్టీ!
టీవీకే అధ్యక్షఉడు విజయ్ పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. కరూర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో తదుపరి కార్యాచరణ, న్యాయ సలహాలపై నేతలతో చర్చిస్తున్నారు. తొక్కిసలాట ఘటనపై మద్రాసు హైకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. స్వతంత్ర దర్యాప్తు చేయాలని కోరనున్నట్లు సమాచారం. కాగా తొక్కిసలాట ఘటనకు ప్రభుత్వమే కారణమని టీవీకే పార్టీ అంటోంది.




