మొంథా తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 25వేలు నష్టపరిహారం చెల్లించాలని మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తుపాన్ కారణంగా చేతికొచ్చిన పంట ఒరిగిపోయి ధాన్యమంత నేల రాలి రైతును తీవ్రంగా నష్టపరిచిందని అవేదన వ్యక్తం చేశారు. శనివారం నంగునూర్ మండలంలోని మగ్ధూంపూర్ గ్రామంలో ధాన్యం సేకరణ కేంద్రాన్ని సందర్శించి తడిసిన ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాగుల సారయ్య, మాజీ సర్పంచ్ మయోజు చక్రపాణిి తదితరులు పాల్గొన్నారు