సిద్దిపేట జిల్లా కేంద్రంలో మంగళవారం శ్రీకృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో సదర్ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ గోరటి వెంకన్న హాజరయ్యారు. హరియాణా నుంచి తెప్పించిన నాలుగు దున్నలను ఊరేగించారు. మున్సిపల్ చైర్మన్ మంజుల రాజనర్సు, వైస్ చైర్మన్ కనకరాజు శ్రీకృష్ణుడి విగ్రహానికి పూజలు చేశారు.