జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ శనివారం మున్సిపల్ కమిషనర్లతో మాట్లాడుతూ, పట్టణ పౌరులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని మున్సిపాలిటీలలో పారిశుద్ధ్య కార్యక్రమాలు, త్రాగునీరు సరఫరా సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. వేసవిలో నీటి సరఫరాలో ఇబ్బంది లేకుండా ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని, ప్రతి మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్యక్రమాలు తప్పనిసరిగా నిర్వహించాలని సూచించారు. అలాగే, పట్టణ ఆదాయానికి కీలకమైన పన్నులను సకాలంలో వసూలు చేయాలని సూచించారు.