సిద్దిపేట జిల్లా పెద్దగుండవెల్లీ గ్రామంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. 12 జట్లతో నాలుగు రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో యువతతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. గ్రామ సర్పంచ్ శ్రీమతి వజ్రవ్వ, ఉప సర్పంచ్ బండారి రామచంద్రం, గ్రామ పెద్దలు, యువకులు, గ్రామస్తులు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొని క్రీడాకారులను ప్రోత్సహించారు. ఈ టోర్నీ గ్రామంలో ఐక్యత, స్నేహభావం పెంపొందిస్తుందని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.