సామాజిక సమానత్వం కోసం పాటుపడిన వీరుడు సర్వాయి పాపన్న గౌడ్

6చూసినవారు
సామాజిక సమానత్వం కోసం పాటుపడిన వీరుడు సర్వాయి పాపన్న గౌడ్
సిద్ధిపేట మున్సిపల్ చైర్మన్ కడవేరుగు మంజులరాజనర్సు మాట్లాడుతూ, సర్వాయి పాపన్న గౌడ్ బహుజన పోరాట యోధుడు, రాజకీయ, సామాజిక సమానత్వం కోసం పాటుపడిన వీరుడని కొనియాడారు. గురువారం సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా సిద్ధిపేట పట్టణంలోని కోమటి చెరువు వద్ద గల పాపన్న గౌడ్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ కడవేరుగు రాజనర్సు, కౌన్సిలర్లు, గౌడ కులస్థులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :