సిద్దిపేట జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో సోమవారం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్ హైమావతి, మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో ఎన్నికల మార్గదర్శకాల ప్రకారం స్క్రూటినీ చేపట్టాలని ఆదేశించారు. రెండో విడత నామినేషన్లకు మంగళవారం చివరి రోజు కావడంతో, ఎక్కువ మంది అభ్యర్థులు వచ్చే అవకాశం ఉన్నందున ఆర్, ఏఆర్ఓలు వేరువేరుగా కౌంటర్లు ఏర్పాటు చేసి నామినేషన్లను స్వీకరించాలని సూచించారు.