సిద్దిపేట జిల్లాలోని అన్ని ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయడానికి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి (డీఈవో) శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఈనెల 28వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఏప్రిల్ 9న ప్రవేశ పరీక్ష నిర్వహించబడుతుంది. మరిన్ని వివరాల కోసం ఆయా ఆదర్శ పాఠశాలల ప్రధానోపాధ్యాయులను సంప్రదించాలని ఆయన సూచించారు.