సిద్దిపేట ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినులు అస్మిత మహిళా లీగ్ జిల్లా స్థాయి అండర్-19 సైక్లింగ్ విభాగంలో అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఎంపికైన వారిలో పి. అంకిత, ఎస్. సాయిప్రసన్న (MPC 2వ సంవత్సరం), రిజ్వానా బేగం, ఎం. లిఖిత (CEC 1వ సంవత్సరం) ఉన్నారు. విద్యార్థినుల విజయాన్ని కళాశాల ప్రిన్సిపాల్ హిమబిందు, అధ్యాపకులు అభినందించారు. రాష్ట్రస్థాయిలోనూ ఉత్తమ ప్రతిభ కనబరిచి కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని ప్రిన్సిపాల్ ఆకాంక్షించారు.