సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ఆదివారం తెల్లవారుజామున నాలుగు దుకాణాల్లో చోరీలు జరిగాయి. ఈ ఘటనలకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను పోలీసులు విడుదల చేశారు. నిందితులను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోందని, అనుమానితుల గురించి సమాచారం తెలిసిన వారు వెంటనే పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.