నారాయణరావుపేటలోని KNM EM హైస్కూల్ గణిత ఉపాధ్యాయురాలు శెట్టి సుజాతకి ప్రముఖ ఉపాధ్యాయురాలు అవార్డు లభించింది. ఆదివారం మధ్యాహ్నం 1 గంటలకు సిద్దిపేటలోని కొండ భూదేవి ఫంక్షన్ హాల్‌లో TSPA ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు చేతుల మీదుగా ఆమె అవార్డు అందుకున్నారు. ఇబ్రహీంపూర్‌కు చెందిన సుజాత విద్యార్థులకు క్రమశిక్షణతో గణితాన్ని బోధిస్తున్నారు. పాఠశాల ప్రిన్సిపాల్ కొనయగారి సంతోష్ కుమార్, ఉపాధ్యాయ బృందం ఆమెను అభినందించారు.