సిద్దిపేట: పదవీ విరమణ చేసిన కానిస్టేబుల్ కు ఘనంగా వీడ్కోలు

1చూసినవారు
సిద్దిపేట: పదవీ విరమణ చేసిన కానిస్టేబుల్ కు ఘనంగా వీడ్కోలు
సిద్దిపేట పోలీసు కమీషనరేట్ పరిధిలో సుదీర్ఘంగా విధులు నిర్వహించి, గురువారం పదవీ విరమణ పొందిన పోలీస్ కానిస్టేబుల్ వంటేరు అమరేందర్ రెడ్డిని అదనపు డీసీపీ అడ్మిన్ కుశాల్కర్ అభినందించి, సన్మాన పత్రం, మెమొంటో అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పోలీస్ శాఖలో సుదీర్ఘ సర్వీస్ పూర్తి చేసుకుని పదవీ విరమణ చేయడం జరుగుతుందని, ఉద్యోగ నిర్వహణలో అంకితభావంతో పనిచేసి అందరి మన్ననలను పొందినారని తెలిపారు. పదవీ విరమణ చేసిన మీకు పోలీస్ కుటుంబంలో ఎలాంటి సమస్య వచ్చినా తనను సంప్రదించవచ్చని అదనపు డీసీపీ కుశాల్కర్ తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్