కేంద్ర పట్టణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పుణేలో మూడు రోజుల పాటు జరిగిన అవగాహన సదస్సుకు సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ హాజరయ్యారు. అమృత్ 2.0లో భాగంగా చెరువుల సంరక్షణ, నిర్వహణ, జలాశయాల మ్యాపింగ్, మురికి నీటి శుద్దీకరణ, సంప్రదాయ నీటి వనరుల పునర్జీవనం వంటి అంశాలపై ఆయన క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. దేశవ్యాప్తంగా 28 మంది మున్సిపల్ కమిషనర్లకు ఈ అవకాశం లభించింది.