సిద్దిపేట: యువకుడి అరుదైన ఘనత పోటీ పరీక్షల్లో అద్భుత ప్రతిభ

0చూసినవారు
సిద్దిపేట: యువకుడి అరుదైన ఘనత పోటీ పరీక్షల్లో అద్భుత ప్రతిభ
సిద్దిపేట పట్టణానికి చెందిన కొల్ల మయూఖ్ రెడ్డి జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షల్లో అద్భుత ప్రతిభ కనబరిచి జిల్లాకు గర్వకారణంగా నిలిచాడు. లింగారెడ్డిపల్లికి చెందిన వెంకటరామ్ రెడ్డి కుమారుడైన మయూఖ్ రెడ్డి, జేఈఈ 2026 అడ్వాన్స్డ్ ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో 189వ ర్యాంక్ సాధించాడు. అలాగే, టీజీఈఏపీసీఈటీ (ఎంసెట్) 2026లో రాష్ట్ర స్థాయిలో 38వ ర్యాంక్ సాధించి మరో ఘనతను అందుకున్నాడు. మయూఖ్ రెడ్డి సాధించిన ఈ విజయంపై కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, మిత్రులు, ప్రజాప్రతినిధులు, పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you