గురువారం కేసీఆర్ నగర్ లోని బస్తీ దవాఖానను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా కలెక్టర్ హైమావతి, విధులపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని వైద్య సిబ్బందిని హెచ్చరించారు. మెడికల్ ఆఫీసర్ రెండు చోట్ల విధులు నిర్వహిస్తున్నారని, మధ్యాహ్నం 12 గంటలకు మరో పీహెచ్సీకి వెళ్లారని సిబ్బంది తెలపడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్సింగ్ స్టాఫ్ బాలమణి ఒక్కరే ఉన్నారని, సపోర్టింగ్ స్టాఫ్ రమ్య గైర్హాజరయ్యారని గుర్తించారు. విధులకు గైర్హాజరైన వారిపై చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్ఓ డాక్టర్ ధనరాజ్ ను ఫోన్లో కలెక్టర్ ఆదేశించారు.