సిద్ధిపేట: అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో అడ్మిషన్లు ప్రారంభం

82చూసినవారు
సిద్ధిపేట: అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో అడ్మిషన్లు ప్రారంభం
సిద్ధిపేటలోని అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని శుక్రవారం ప్రత్యేక అధికారి ఇమ్రానాబేగం తెలిపారు. అనంతరం మాట్లాడుతూ పాఠశాలలో 4వ తరగతి నుంచి 8వ తరగతి వరకు బోధించనున్నట్లు తెలిపారు. బాలకార్మికలు, మధ్యలో చదువు నిలిపివేసినవారు, దారిద్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఉచిత వసతితో పాటు విద్యను అందిస్తున్నామని అన్నారు. పేద కుటుంబాలకు చెందిన బాలురు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్