తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువులదేనని అఖిలభారత హనుమాన్ దీక్ష పీఠం సిద్దిపేట విభాగం నాయకులు గ్యాదరి పరమేశ్వర్, నేతి కైలాసం అన్నారు. శుక్రవారం సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ గురు పౌర్ణమిని పురస్కరించుకొని అఖిలభారత హనుమాన్ దీక్ష పీఠాధిపతి శ్రీదుర్గాప్రసాద్ స్వామీజీకి ఈనెల 12న పట్టణ శివారులోని బైరి అంజయ్య గార్డెన్లో గురుపూజ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు.