సమస్యలు పరిష్కరించుకోవడానికి, న్యాయం కోసం పోరాడటానికి చట్టాలపై అవగాహన అవసరమని జిల్లా న్యాయసేవాధికారి సంస్థ సెక్రటరీ స్వాతిరెడ్డి అన్నారు. బుధవారం చిన్నకోడూరులోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లీగల్ సెర్వీసెస్ అథారిటీ ద్వారా కోర్టుకు వచ్చి ఉచితంగా న్యాయం పొందవచ్చన్నారు. బాలల చట్టాలపై, హక్కులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు.