సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు మండలములోని మేడిపల్లి స్కూల్లో బుధవారం బాలల రక్షణ, సంరక్షణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా శిశు సంక్షేమ శాఖ, బాలల పరిరక్షణ విభాగం చైల్డ్ హెల్ప్ లైన్ 1098 ప్రతినిధి బాయికాడి లక్ష్మణ్ మాట్లాడుతూ 0 నుండి 18 సంవత్సరాలు గల బాల బాలికల రక్షణ, సంరక్షణ కోసం చైల్డ్ హెల్ప్ లైన్ పనిచేస్తుందని అన్నారు.