రాష్ట్రంలో పారాక్వాట్, దాని ఉత్పత్తుల వాడకాన్ని ప్రభుత్వం 60 రోజుల పాటు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సమస్త జీవరాశికి ప్రతికూల ప్రభావాలు, రైతుల ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారి స్వరూపరాణి తెలిపారు. ఈ మందుల విక్రయాలు, తయారీ, వినియోగంపై నిషేధం విధించారు. ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.