సిద్ధిపేట: బాపూజీ తెలంగాణ సమాజానికి చేసిన సేవలు మరవరానివి

751చూసినవారు
సిద్ధిపేట: బాపూజీ తెలంగాణ సమాజానికి చేసిన సేవలు మరవరానివి
కొండా లక్ష్మణ్ బాపూజీ చిరస్మరణీయులుగా చరిత్రలో నిలిచిపోయారని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కీ వెంకటయ్య అన్నారు. శనివారం సిద్దిపేట కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా వెనకబడిన తరగతులు అభివృద్ధి శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కీ వెంకటయ్య, జిల్లా కలెక్టర్ హైమావతి కలిసి పాల్గొని పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ సమాజానికి చేసిన సేవలు మరవరానివన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్