సిద్దిపేట న్యాయవాదులు శ్రీకాంత్, మురళీమోహన్ రావులు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయిపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమని దళిత వర్కింగ్ జర్నలిస్టు సొసైటీ జిల్లా గౌరవ అధ్యక్షులు బబ్బురూ రాజు, జిల్లా అధ్యక్షుడు జంగం రాజలింగం అన్నారు. శనివారం సిద్దిపేట ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ చర్యను అత్యంత దుర్మార్గమని ఖండించిన వారు, ఆ న్యాయవాదుల సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.