సిద్ధిపేట: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

592చూసినవారు
సిద్ధిపేట: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో సిద్దిపేట కలెక్టరేట్లో శనివారం బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టర్ హైమావతి, అదనపు కలెక్టర్ గరీమా అగ్రవాల్ తో కలిసి మహిళా ఉద్యోగులు బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రపంచంలోనే పువ్వులను పూజించే ఏకైక పండుగ బతుకమ్మ అని అన్నారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ఆఫీస్ పనులతో బిజీగా ఉండే ఉద్యోగస్తులు సాంప్రదాయ పండుగలో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు. కలెక్టర్ చేతుల మీదుగా పలువురికి బహుమతులు అందజేశారు.

సంబంధిత పోస్ట్