సిద్ధిపేట: నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

2చూసినవారు
సిద్ధిపేట: నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి
సిద్ధిపేట పట్టణ పద్మశాలీ సమాజం అధ్యక్షుడు కాముని రాజేశం, పద్మశాలీలు రాజకీయంగానే కాకుండా అన్ని రంగాల్లోనూ రాణించాలని పిలుపునిచ్చారు. సోమవారం సిద్దిపేటలోని మార్కండేయ దేవాలయంలో పద్మశాలీ వృత్తిలో రాణిస్తున్న ఆర్ఎంపీ & పీఎంపీ వైద్యులను సమాజం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు రాజేశం నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట ఆర్ఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ముదిగొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :