కొండపాక మండలం బందారం గ్రామంలో గురువారం విషాదకర సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కీసర రమేష్ అనితల రెండేళ్ల కుమారుడు దీక్షిత్, ఇంటి పక్కన ఉన్న నీటి గుంతలో పడి మృతి చెందాడు. బుధవారం కురిసిన వర్షానికి ఆ గుంతలు నీటితో నిండిపోయాయి. దీక్షిత్ పిల్లలతో ఆడుకుంటూ అందులో పడిపోయినట్లు తెలుస్తోంది. బాలుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు వెతికారు. చివరికి ఇంటి పక్కన గల నీటి గుంతలో పడిపోయి ఉన్నట్లు గుర్తించారు. అప్పటికే బాలుడు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.