వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా మంగళవారం సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎన్. సంతోశ్ కుమార్ మాట్లాడుతూ, క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తిస్తే వ్యాధిని జయించవచ్చని తెలిపారు. క్యాన్సర్‌లో 200 రకాలు ఉన్నాయని, మానసికంగా దృఢంగా ఉంటే వ్యాధిని ఎదుర్కోవచ్చని, ముఖ్యంగా మహిళలు జాగ్రత్తగా ఉండాలని, వారి ఆరోగ్యం కుటుంబానికి ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.