సిద్దిపేట: ప్లాన్ ప్రకారమే చంద్రబాబుకు సీఎం రేవంత్ సహకారం: హరీశ్ రావు

1చూసినవారు
సిద్దిపేట: ప్లాన్ ప్రకారమే చంద్రబాబుకు సీఎం రేవంత్ సహకారం: హరీశ్ రావు
సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర విమర్శలు చేశారు. ప్లాన్ ప్రకారమే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి CM రేవంత్ సహకరిస్తున్నారని ఆయన ఆరోపించారు. పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర నీటి హక్కులను తాకట్టు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. ఢిల్లీలో జరుగుతున్న జలవివాదాల కమిటీ సమావేశం AP ఒత్తిడితోనే ఏర్పాటు చేశారని విమర్శించారు. CWC అనుమతులు ఆపకుండానే మీటింగ్ కు వెళ్లడం రాష్ట్రానికి మరణ శాసనమని, 'కత్తి CBNది.. పొడిచేది రేవంత్' అంటూ ఫైర్ అయ్యారు.

సంబంధిత పోస్ట్