ప్రభుత్వం మీసేవ యూజర్ ఛార్జీలను పెంచడంతో నిర్వాహకులకు ఆర్థికంగా బలోపేతం అవుతారని మీసేవ నిర్వాహకులు తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో మీసేవ మిత్రుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా మేనేజర్ కమటం ఆనంద్ కుమార్ మాట్లాడుతూ, గత పన్నెండు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న కమీషన్ పెంపు కల నెరవేరిందని తెలిపారు. టీజీటీఎస్ జిల్లా మేనేజర్ మరాఠి నరేష్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పెంపు ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి దోహదపడుతుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.