సిద్ధిపేట: కామన్ డైట్ మెనూ తప్పనిసరిగా పాటించాలి

2చూసినవారు
సిద్ధిపేట: కామన్ డైట్ మెనూ తప్పనిసరిగా పాటించాలి
సిద్ధిపేట జిల్లా చేర్యాల పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల మరియు జూనియర్ కళాశాలను ఆదివారం జిల్లా కలెక్టర్ హైమావతి ఆకస్మికంగా సందర్శించారు. రాత్రి భోజన ప్రక్రియను పరిశీలించిన ఆమె, వంటగది, డైనింగ్ హాల్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజు శుభ్రంగా కడగాలని, విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆహార పదార్థాల నాణ్యత పెంచాలని, కామన్ డైట్ మెనూ తప్పనిసరిగా పాటించాలని సిబ్బందిని ఆదేశించారు.

ట్యాగ్స్ :