రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత కాంగ్రెస్ దే అని చిన్నకోడూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మీసం మహేందర్ యాదవ్ అన్నారు. ఆదివారం ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, నియోజకవర్గ ఇన్ ఛార్జ్ హరికృష్ణ ఆదేశాల మేరకు జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ అనే నినాదంతో ప్రారంభమైన రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర మండల పరిధిలోని వివిధ గ్రామాలలో నేటితో దిగ్విజయంగా ముగిసిందని అన్నారు.