జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రహరీ గోడలు, మరుగుదొడ్ల నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హైమావతి పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హల్లో, ఏంజీఎన్ఆర్ఈజీఎస్ కింద నిర్మాణంలో ఉన్న పనులు, ఈ ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన పనులపై ఆయా శాఖల అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు.