సిద్ధిపేట: నల్ల బ్యాడ్జిలతో సీపీఐ ఆధ్వర్యంలో నిరసన

66చూసినవారు
సిద్ధిపేట: నల్ల బ్యాడ్జిలతో సీపీఐ ఆధ్వర్యంలో నిరసన
వక్ఫ్ బోర్డు బిల్లును రద్దు చేయకుంటే బిజెపిపై యుద్ధం తప్పదని సీపీఐ సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్ అన్నారు. దేశంలో ముస్లిం మైనారిటీ ప్రజల హక్కులను కాలరాసే వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంటులో రాజ్యసభలో ఏకపక్షంగా ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తూ శనివారం చేర్యాల పట్టణంలో సీపీఐ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపి ఆందోళన చేపట్టారు. వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్లును ఆమోదించడం చాలా అన్యాయమని అన్నారు.

సంబంధిత పోస్ట్