సిద్ధిపేట: ప్రజా సమస్యలపై సీపీఐ రాజీలేని పోరాటం

2చూసినవారు
సిద్ధిపేట: ప్రజా సమస్యలపై సీపీఐ రాజీలేని పోరాటం
చేర్యాల మున్సిపాలిటీలో నెలకొన్న ప్రజా సమస్యలపై సీపీఐ రాజీలేని పోరాటం నిర్వహిస్తామని సీపీఐ సిద్ధిపేట జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్ తెలిపారు. విద్యారంగ సమస్యలతో పాటు ప్రజా సమస్యలపై పోరాడుతున్న సీపీఐ 11వ వార్డు అభ్యర్థి రామగళ్ల నరేష్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ బుధవారం సీపీఐ నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేర్యాల పట్టణంలో నెలకొన్న అనేక సమస్యల పరిష్కారం కోసం భారత కమ్యూనిస్టు పార్టీ నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్