సిద్దిపేట: వృద్ధుడి భూమిని కూతురు కబ్జా.. ప్రజావాణిలో ఆవేదన

0చూసినవారు
సిద్దిపేట: వృద్ధుడి భూమిని కూతురు కబ్జా.. ప్రజావాణిలో ఆవేదన
వృద్ధాప్య పింఛన్ కోసం సంతకం చేయాలని చెప్పి, తన వ్యవసాయ భూమిని మోసపూరితంగా రిజిస్ట్రేషన్ చేయించుకుందని ఎల్లెంకి కిష్టారెడ్డి అనే వృద్ధుడు ప్రజావాణిలో అర్జీ చేసుకున్నారు. నంగనూరు మండలం పాలమాకుల గ్రామంలోని 3 ఎకరాల భూమిని తన నాలుగో కుమార్తెకు కేటాయించగా, రెండో కుమార్తె అరుణ వృద్ధాప్య పింఛన్ పేరుతో సిద్దిపేటలో గిఫ్ట్ డీడ్ ద్వారా భూమిని తన పేరున రిజిస్ట్రేషన్ చేయించుకుందని ఆరోపించారు. ఈ విషయం తెలియకుండా ఏడాది పాటు తనను వారితో ఉంచుకుని, తర్వాత స్వగ్రామంలో వదిలేశారని, ప్రశ్నించగా తమపై కేసు నమోదు చేయించారని తెలిపారు. మోసపూరిత రిజిస్ట్రేషన్ రద్దు చేసి, భూమిని తిరిగి తన పేరిట మార్చాలని అధికారులను కోరారు.

సంబంధిత పోస్ట్