సిద్ధిపేట: జిల్లా స్థాయిలో ఆంగ్లభాష ప్రతిభా పోటీలు

0చూసినవారు
సిద్ధిపేట: జిల్లా స్థాయిలో ఆంగ్లభాష ప్రతిభా పోటీలు
సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ (ఎల్టా) ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఆంగ్లభాష ప్రతిభా పోటీలు నిర్వహించారు. టెడ్, ఎడ్, స్టూడెంట్ టాక్ పోటీల్లో సుమారు 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు. డీఈఓ శ్రీనివాస్ రెడ్డి ఒలింపియాడ్ ప్రశ్నపత్రాన్ని ఆవిష్కరించి, విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారి ముండ్రాతి రమేశ్, అర్బన్ మండల విద్యాధికారి ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్