మోంథా తుఫాను ప్రభావిత ప్రాంతాలను ఆర్డీవో సదానందం, మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ గురువారం సిద్ధిపేటలో క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. నాయకంనగర్ లో నీటి నిల్వలను పరిశీలించి, జేసీబీతో నీటిని మళ్లించేలా చర్యలు తీసుకున్నారు. కోమటి చెరువు కెనాల్ నీటి ప్రవాహాన్ని కూడా పరిశీలించారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసించవద్దని, సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ప్రజలకు సూచించారు.