సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం మగ్ధుంపూర్ లో శుక్రవారం ముందస్తు బడి బాట నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించి వారి శారీరక, మానసిక వికాసానికి పునాది వేసుకోవాలని సర్పంచ్ పాకాల శ్రీనివాస్ తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలను వివరించారు. ప్రభుత్వ బడిలో నాణ్యమైన విద్య ఉచితంగా అందుతుందని, పిల్లల భవిష్యత్తుకు ఉజ్వల పునాది ఏర్పడుతుందని ఆయన తెలిపారు.