సిద్దిపేట: ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రతి గింజ కొనాలి

0చూసినవారు
సిద్దిపేట: ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రతి గింజ కొనాలి
ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రతి గింజను కొనాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు, ఇబ్రహీంనగర్, గోనెపల్లి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను సందర్శించి, తడిసిన ధాన్యాన్ని పరిశీలించి, రైతులకు భరోసా ఇచ్చారు. సకాలంలో వడ్లు కొనకపోవడం వల్లే పంట తడిసిందని, ఆన్లైన్ ట్యాగింగ్ పేరుతో ప్రభుత్వం నెల రోజులు కాలయాపన చేయడం వల్లే ఈ దుస్థితి దాపురించిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :