సిద్ధిపేట: ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చెయ్యాలి

0చూసినవారు
సిద్ధిపేట: ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చెయ్యాలి
సిద్దిపేట జిల్లా దుబ్బాక పోలీస్ స్టేషన్ పరిధిలోని చెక్ పోస్ట్ ను బుధవారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హైమావతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా, స్టేట్ ఎలక్షన్ కమిషన్ నియమావళి ప్రకారం ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, ప్రతి వాహన తనిఖీ ప్రక్రియను వీడియో తీయాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం రిజిస్టర్ ను పరిశీలించి, విధులు పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్