సిద్ధిపేట మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శంకర్ నారాయణ ప్రతి వాహనదారుడు తప్పకుండా రోడ్డు నిబంధనలు పాటించాలని సూచించారు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా, శుక్రవారం సిద్దిపేట పట్టణంలోని పలు ప్రధాన కూడళ్ల వద్ద వాహనదారులకు రహదారి భద్రత నిబంధనలపై అవగాహన కల్పించారు. నిబంధనలు పాటించకపోవడమే అధిక ప్రమాదాలకు కారణమని, చిన్న పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని, వాహనాలు నడిపేటప్పుడు సీటు బెల్టు తప్పనిసరిగా బిగించుకోవాలని ఆయన తెలిపారు.