సిద్దిపేట: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి

437చూసినవారు
సిద్దిపేట: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి
విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) నాయకులు డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిరాహార దీక్ష చేపట్టిన ఏబీవీపీ నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయాలని చూస్తోందని ఆరోపించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో సుమారు 14 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన పేద, మధ్యతరగతి విద్యార్థులు వివిధ కోర్సుల్లో చదువుకుంటున్నారని వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్