వరకట్నపు వేధింపులతో మహిళ మృతికి కారణమైన కేసులో నలుగురిని సిద్దిపేట టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం కేసు వివరాలను సిద్దిపేట ఏసీపీ మధు వెల్లడించారు. చెన్న అక్షయను పవన్ కుమార్ 2019లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇరు కుటుంబాలు కలిసి 2020లో మరోసారి కట్న కానుకలతో ఘనంగా వివాహం జరిపించారు. ఈ క్రమంలో అదనపు కట్నం కోసం పవన్ కుటుంబ సభ్యులు వేధింపులకు గురిచేయడంతో ఈ నెల 10న అక్షయ ఆత్మహత్యకు పాల్పడింది